Tuesday, May 6, 2025

రోడ్లు బాగున్న దేశాన్నేఅభివృద్ధి చెందిన దేశంగా ప్రజలు భావిస్తారు: నితిన్ గడ్కరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది అని అన్నారు. ఈ సందర్భంగా అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువసార్లు రావడానికి తాను ఇష్టపడతానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పిఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నేఅభివృద్ధి చెందిన దేశంగా ప్రజలు భావిస్తారని తెలియజేశారు. అమెరికా ధనికదేశం కాబట్టి రోడ్లు బాగున్నాయనేది సరికాదని, రోడ్లు బాగున్నందునే అమెరికాను ధనిక దేశంగా భావిస్తున్నామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News