- Advertisement -
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత సాయుధ దళాలు ప్రతీకార దాడి చేస్తాయనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్ బెదిరింపులకు దిగుతోంది. ఇప్పటికే భారీగా సైన్యాన్ని సరిహద్దులకు తరలించిన పాక్.. కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. సైనిక విన్యాసాలు ‘ఎక్సర్‌సైజ్ ఇండస్’లో భాగంగా 120 కిలోమీటర్ల పరిధి కలిగిన ఫతాహ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. కాగా, రెండు రోజు క్రితమే 450 కిలోమీటర్ల రేంజ్ గల బాలిస్టిక్ క్షిపణిని పాక్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.
- Advertisement -