- Advertisement -
హైదరాబాద్: వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు వేదికలో..‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. సభాపతి ప్రసాద్ కుమార్, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి, వీరితో పాటు ధరూర్ క్లస్టర్ పరిధిలోని రైతులు, విద్యార్థులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ సన్నద్దంలో భాగంగా శాస్త్రవేత్తలు రైతులను సమాయత్తం చేశారు. వరి సాగులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలని తుమ్మల అన్నారు. యూరియూ అధికంగా వాడి, మనల్ని పోషించే భూతల్లిని నాశనం చేయొద్దు అని సూచించారు. గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం పంటల బీమాను మళ్ళీ పునరుద్దరించనుందని పేర్కొన్నారు.
- Advertisement -