హైదరాబాద్: రాష్ట్రంలోని ఉగ్యోగ సంఘాల తీరుపై సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిసి సమ్మె నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి.. ఆ సమరం తెలంగాణ ప్రజలపైనా’ అని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీల కుట్ర అని సిఎం మండిపడ్డారు. ఈ కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారవద్దని అన్నారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే.. ఉన్న వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిస్తే.. సమాజం సహించదు అని పేర్కొన్నారు. ‘మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? మీ సమరం’ అని ప్రశ్నించారు. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘలే సమరం అంటే ఎలా? ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలకు లేదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఉంటే చర్చించుకుందామని ఉద్యోగ సంఘాలను విజ్ఞప్తి చేశారు.
‘‘అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చని, కానీ, అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.. స్వీయ నియంత్రణే పరిష్కారం. ప్రభుత్వం మన కుటుంబ.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు. నన్ను కోసినా వచ్చిన ఆదాయానికి మించి ఏమీ చేయలేను. ఇప్పుడు కావాల్సింది సమరం కాదు.. సమయస్ఫూర్తి. తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించవద్దు. నాతో కలిసి రండి.. తెలంగాణలను అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం’’ అని రేవంత్ అన్నారు.