Friday, May 23, 2025

టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ అవకాశాలు సులభంగా మారుతాయి. మరోవైపు సన్‌రైజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. దీంతో ఈ కీలక మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. సన్‌రైజర్స్ జట్టు రెండు మార్పులు చేసింది. ట్రావిస్ హెడ్ స్థానంలో సచిన్ బేబిని, మహ్మద్ షమీ స్థానంలో జయదేవ్ ఉనద్కట్‌ని జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News