Tuesday, May 6, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం… బయటకు పరుగులు తీసిన ప్రజలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల‌, జగిత్యాల జిల్లాల్లో భూమి కంపించింది. భూకంపం రావడంతో ప్రజలు భ‌యంతో బ‌య‌టకు ప‌రుగులు తీశారు. ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. రెండుసార్లు తీవ్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. జగిత్యాల లలో  సోమవారం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు భూమి కనిపించిందని స్థానికులు తెలిపారు. భూమి కనిపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపులకు గురయ్యాయని, స్వల్పంగానే భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. నాలుగు నెలల్లో ఇది రెండో సారి భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News