Tuesday, May 6, 2025

‘మెట్‌ గాలా’లో మెరిసిన తారలు.. స్టైలీష్ లుక్ లో షారుక్‌, కియారా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌లో మెట్‌ గాలా వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అందాల భామలు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, సింగర్ దిల్జిత్ దోసాంజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల ముఖ్యంగా షారుఖ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ సూట్ లో భిన్నమైన జ్యువెలరీతో స్టైలీష్ లుక్ లో ఆకట్టుకున్నాడు.

ఇక, కియారా బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఇండియన్ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో తొలిసారి మెట్ గాలాలో కియారా మెరిసింది. అలాగే, ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేసింది. సింగర్ దిల్జిత్ దోసాంజ్.. పంజాబీ స్టైల్ లో రాయల్టీని ప్రదర్శిస్తూ మెట్ గాలాలో మెరిశాడు. ఈ వేడుకలో పాల్గొన్న తారల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News