Tuesday, May 6, 2025

సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్..

- Advertisement -
- Advertisement -

నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వరుసగా 12వరోజు పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. నిన్న రాత్రి జమ్ముకాశ్మీర్ లోని
కుప్వారా, బారాముల్లా, పూంఛ్‌, రాజౌరీ, మెంధార్‌, నౌషేరా, సుందర్‌బానీ, అఖ్నూర్‌ వద్ద పాక్ సైనికులు కాల్పులు జరిపిన ట్లు భారత ఆర్మీ వెల్లడించింది. వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు పాక్ ఆర్మీ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు.

కాగా, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఏ క్షణమైనా దాడి చేస్తుందనే భయంతో పాక్ ఆందోళనలో ఉంది. ఈ క్రమంలోనే మిస్సైల్స్ ప్రయోగిస్తూ.. భారత్ తమపై దాడి చేస్తే అణు బాంబులతో విరుచుకుపడతామని పాక్ బెదిరింపులకు దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News