Tuesday, May 6, 2025

అట్లీతో మూవీలో బాలీవుడ్ హీరో?

- Advertisement -
- Advertisement -

పుష్ప 2తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ తాజాగా ఓ వైట్ టీ షర్ట్‌లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఆ టీ షర్ట్ మీద గాడ్ ఆఫ్ మీమ్ బ్రహ్మానందం ఫొటో ఉంది. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా అని కూడా రాసి ఉంది. ఈ టీషర్ట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. చాలా మందికి ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులకు ఈ టీషర్ట్ తెగ నచ్చేసింది. అల్లు అర్జున్, అట్లీ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఆ హీరో ఎవరు అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుందని తెలుస్తోంది. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడట. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ, – అట్లీ నుంచి ఓ పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.


- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News