టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. త్వరలో కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ మే 30న రిలీజ్ కానుంది. ఇదిలాఉండగా విజయ్ దేవరకొండ తన డెబ్యూ మూవీ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో మరోసారి వర్క్ చేయనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌లో రానున్న మూవీని ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్ నిర్మించనుందని తెలిసింది. అయితే గీతా ఆర్ట్‌తో ఇప్పటికే విజయ్ దేవరకొండ.. గీతా గోవిందం సినిమా చేశాడు. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అయితే విజయ్ దేవరకొండ చేతిలో కింగ్ డమ్ కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై సినిమాలు చేయనున్నాడు ఈ యంగ్ హీరో. దీంతో తరుణ్ భాస్కర్‌తో మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పట్టనుందట.
‘పెళ్లి చూపులు’ డైరెక్టర్‌తో మరోసారి?
- Advertisement -
- Advertisement -
- Advertisement -