Tuesday, May 6, 2025

మంచి మాస్ సినిమా

- Advertisement -
- Advertisement -

అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. కాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మ్యాగి మాట్లాడుతూ… “సినిమాలో మంచి కంటెంట్ ఉంది.

కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు. డైరెక్టర్ జోయెల్ జార్జ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాని మంచి మాస్ సినిమాగా తీశాం. అలాగే ఇందులో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుంది”అని తెలిపారు. ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం మాట్లాడుతూ..“నిర్మాతగా నా తొలి సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 30 ఇయర్స్ పృథ్వీ, హీరో నవీన్, హీరోయిన్లు పూజ సుహాసిని, స్రీలు, కార్తీక్ రత్నం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News