- Advertisement -
తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు సన్నద్దమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నారు. దీంతో మే 7వ తేదీ నుండి రాష్ట్రంలో బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలకు సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఆర్టీసి ఐఎన్‌టీయూసి నేతలు ఇవాళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రికి వివరించారు. అయితే, సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దన్నారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థకు సమ్మె నష్టం చేస్తుందని.. కార్మికుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
- Advertisement -