Tuesday, May 6, 2025

రేవంత్ రెడ్డి.. తెలంగాణ పరువు తీస్తున్నారు: ఈటల ఫైర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ దివాళా తసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఫైరయ్యారు. దీవాళా తీసింది తెలంగాణ కాదు.. కాంగ్రెస్ దివాళ తీసిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తాను సిఎం అని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. నెలకు దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుంటే.. దివాళ తీసిందని ఎలా అంటారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని.. ఇప్పటికీ దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆయన అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెల్వదా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనిలా దాపురించిందని విమర్శించారు.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు సిద్ధమవుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి మాట్టాడుతూ.. తెలంగాణ దివాళా తీసిందని.. బయట ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదన్నారు. తెలంగాణ ప్రతినిధులను దొంగలు చూసినట్లు చూస్తున్నారని.. తనను కోసినా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదన్నారు. వచ్చే ఆధాయం మొత్తం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, పించన్లకే సరిపోతుందని తేల్చి చెప్పారు. అయితే, సిఎం మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News