- Advertisement -
హైదరాబాద్: టూరిజం ప్రమోషన్స్, పెట్టుబడుల ఆకర్షణ కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బిఆర్ఎస్ విమర్శల్లో పసలేదని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..మిస్ వరల్డ్ ఈవెంట్ కు రూ. వందల కోట్లు ఖర్చు పెట్టడం లేదని, తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందని చెప్పారు. ఫార్ములా- ఈ రేస్ ను తాము తప్పుబట్టలేదని అన్నారు. నిబంధనలు ఉల్లఘించి చేసిన చెల్లింపులనే తప్పుబట్టామని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
- Advertisement -