Friday, May 9, 2025

గచ్చిబౌలిలో నూతన క్లినిక్‌ ప్రారంభించిన క్రౌన్ వెట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఆధునిక వెటర్నరీ క్లినిక్‌ల చైన్ అయిన క్రౌన్ వెట్, భారతదేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల కుటుంబాలకు అధిక-నాణ్యత, ప్రేమతో కూడిన పశువైద్య సంరక్షణను అందించాలనే తమ లక్ష్య సాకార దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ తమ సరికొత్త క్లినిక్-క్రౌన్ వెట్ గచ్చిబౌలిని ప్రారంభించినట్లు వెల్లడించింది.

జయభేరి ఎన్‌క్లేవ్‌లోని మాపుల్ సెలెస్టియాలో ఉన్న 1,400 చదరపు అడుగుల క్లినిక్ డిజిటల్ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, IDEXX ఎనలైజర్‌లను ఉపయోగించి అంతర్గత పాథాలజీ మరియు అధునాతన శస్త్రచికిత్స, రోగనిర్ధారణ సామర్థ్యాలతో సహా అత్యుత్తమ వైద్య మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఈ క్లినిక్ ప్రత్యేకంగా కుక్కలు మరియు పిల్లి జాతి జంతువులకు సేవలు అందిస్తుంది. ఇక్కడ అందించే పూర్తి స్థాయి సేవలలో…

· సాధారణ సంప్రదింపులు
· శస్త్రచికిత్స
· నివారణ ఆరోగ్య ప్రణాళికలు
· ఇన్-హౌస్ పాథాలజీ
· డెర్మటాలజీ
· అడ్వాన్స్‌డ్ డయాగ్నస్టిక్ ఇమేజింగ్
· పెట్ డెంటల్ కేర్
· పెట్ న్యూట్రిషనల్
· ఫార్మసీ
· హాస్పిటలైజేషన్ మరియు ఇన్ పేషెంట్ కేర్

పెంపుడు జంతువుల పట్ల నగరం యొక్క లోతైన ప్రేమ , విశ్వసనీయ పశువైద్య సేవలకు పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా ఈ సరికొత్త క్లినిక్ ప్రారంభంతో, క్రౌన్ వెట్ ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా మూడు క్లినిక్‌లను నిర్వహిస్తోంది (హైటెక్ సిటీ మరియు బంజారా హిల్స్ వంటి రెండు ఇతర ప్రదేశాలు సహా) . క్రౌన్ వెట్, గచ్చిబౌలి, ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పనిచేస్తుంది.

భవిష్యత్తులో 24/7 సేవలు విస్తరించబడతాయి.

“మా గచ్చిబౌలి క్లినిక్ ప్రారంభంతో, ప్రపంచ స్థాయి, ప్రేమతో కూడిన పశువైద్య సంరక్షణను మరిన్ని పెంపుడు జంతువుల కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలనే మా లక్ష్యాన్ని మేము కొనసాగిస్తున్నాము. ప్రతి క్రౌన్ వెట్ క్లినిక్ పెంపుడు జంతువులకు వైద్య నైపుణ్యం మాత్రమే కాదు, సానుభూతి, గౌరవం మరియు వాటి శ్రేయస్సు పట్ల అచంచలమైన నిబద్ధత అవసరమనే నమ్మకంపై నిర్మించబడింది,” అని క్రౌన్ వెట్ వ్యవస్థాపకులు ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్ అన్నారు

“మా పదవ క్లినిక్ ప్రారంభోత్సవాన్ని చేరుకున్న వేళ, భారతదేశవ్యాప్తంగా పెంపుడు జంతువులకు అధిక-నాణ్యత కలిగిన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంలో క్రౌన్ వెట్ సాధించిన విజయం పట్ల సంతోషంగా వున్నాము . ప్రపంచంలోని ప్రముఖ పెట్‌కేర్ ప్రదాత అయిన మార్స్ వెటర్నరీ హెల్త్‌తో మా భాగస్వామ్యం , మా వైద్యులు, సహాయక సిబ్బందికి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంలో మాకు తోడ్పడింది. ఈ మైలురాయి శ్రేష్ఠత పట్ల మా నిబద్ధతను మరియు ఆరు నగరాల్లో మా కార్యకలాపాల విస్తరణను ప్రతిబింబిస్తుంది” అని క్రౌన్ వెట్ సీఈఓ షెరాయ్ వాడియా అన్నారు.

భారతదేశంలో పెంపుడు జంతువుల జనాభా పెరుగుతుండటం తో పాటుగా పశువైద్య సేవల చుట్టూ అంచనాలు అభివృద్ధి చెందుతున్న వేళ, సాంకేతికత, సానుభూతి మరియు శ్రేష్ఠత ద్వారా పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి క్రౌన్ వెట్ కట్టుబడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News