చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపిఎల్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించి.. టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా నిలిచింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్‌కు గాయం కావడంతో ఎంఎస్ ధోనీ జట్టుకు కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. దీంతో అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాట్స్‌మెన్‌గా రెండింటిలో ధోనీకి చేధు అనుభవాలే ఎదురయయ్యయి.
ఈ నేపథ్యంలో సిఎస్‌కే మాజీ ఆటగాడు సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. కీపింగ్‌లో రాణిస్తున్నప్పటికీ… కెప్టెన్‌గా, బ్యాటర్ విఫలమవుతున్నారు. దీంతో ఆయన ఇక రిటైర్ అవ్వాలని. అంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైనా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓ కార్యక్రమంలో ‘ధోనీ రిటైర్ అయితే చెన్నై జట్టులో కీపింగ్ ఎవరు చేస్తారు?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానరంగా ‘అది ఎవరికీ తెలియదు. ధోనీ ఇంకో రెండు సంవత్సరాలు చెన్నైకి ఆడుతాడు’ అంటూ రైనా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు.