Wednesday, May 7, 2025

ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 15 ఏళ్ల తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఎ1గా బివి శ్రీనివాసరెడ్డి, ఎ2గా గాలి జనార్ధన్‌రెడ్డిలను, ఎ3గా విడి రాజగోపాల్‌ను, ఎ4గా ఒఎంసి కంపెనీని, ఎ7గా మెఫజ్ అలీఖాన్‌ను దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సహా మిగితా వారికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 2022లోనే ఎ6గా ఉన్న శ్రీలక్ష్మిని ఈ కేసులో నుంచి హైకోర్టు డిశ్చారి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఎ9గా ఉన్న సబితా ఇంద్రరెడ్డిని నిర్ధోషిగా తేల్చింది. 2004-2009 మధ్య గనుల మంత్రిగా సబిత పని చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఎ5గా ఉన్న లింగారెడ్డి మృతి చెందారు. ఎ8 విశ్రాంత ఐఎఎస్ కృపానందంను కూడా నిర్ధోషిగా కోర్టు తేల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News