Tuesday, May 6, 2025

ప్లేఆఫ్స్‌ నుంచి ఔటయినా.. రికార్డు సాధించిన ఇషాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ వర్షార్పణం అయింది. అయితే ప్లేఆఫ్స్ నుంచి ఔట్ అయినా.. సన్‌రైజర్స్‌ జట్టులో ఈ సీజన్‌లో ఆరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ మాత్రం అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లవి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మూడు కూడా ఇషాన్ అందుకున్న క్యాచ్‌లే. అంతేకాక.. ఉనద్కట్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ క్యాచ్‌ని కూడా ఇషాన్ అందుకున్నాడు. దీంతో టాప్-4 బ్యాటర్ల వికెట్‌లో భాగమైన ఇషాన్ చరిత్ర సృష్టించాడు. అంతేకాక ఐపిఎల్‌లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న 27వ ఆటగాడిగా, 13వ వికెట్ కీపర్‌గా ఇషాన్ రికార్డుల్లోకి ఎక్కాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News