Wednesday, May 7, 2025

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. ‘కూలీ’ కౌంట్‌డౌన్ షురూ..

- Advertisement -
- Advertisement -

తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సినిమాల యూనివర్స్‌ అంటే కోలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్‌లో ఇప్పటివరకూ వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఈ యూనివర్స్‌లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ‘కూలీ’ అనే టైటిల్‌ని పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్‌ని వదిలారు.

కూలీ మరో 100 రోజుల్లో అంటే.. ఆగస్టు 14వ తేదీన విడుదల అవుతున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఈ సినిమాలోని కొన్ని పాత్రలను మనకు వెనుక నుంచి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా, సన్‌ పిక్ఛర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News