Wednesday, May 7, 2025

ఉద్యమం ముసుగులో పార్టీని నిర్మించుకున్నారు.. రాష్ట్రాన్ని దొంగల్లా దొచుకున్నారు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నాయకులు ఉద్యమం ముసుగులో పార్టీని నిర్మించుకుని, అధికారం రాగానే రాష్ట్రాన్ని దొంగల్లా దోచుకున్నారని ఎంఎల్‌సి అద్దంకి దయాకర్ ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పనులకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ కడుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సిఎం నిజయితీగా వివరించారని అన్నారు. హైడ్రాపై అనవసరంగా నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్‌కు కాలు విరిగినా గుణం మారలేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌ను తట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని, కెటిఆర్, హరీష్ రావు దిష్టి బొమ్మల్లా ఉండటం తప్ప ఏ చేయలేరని విమర్శించారు.

తేదీ, సమయం చెబితే తాను బిజెపి కార్యాలయానికి వస్తామని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఈటెల రాజేందర్ సగం బిజెపి, సగం బిఆర్‌ఎస్ అని, అటువంటి వ్యక్తి నిబద్దతతో నిరంతరం ప్రజల కోసం పనిచేసే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం హస్యాస్పదం అని పేర్కొన్నారు. రెడ్డి బిడ్డ అంటున్న రెవంత్ రెడ్డి బిసిలకు 42 శాతం రిజర్వేన్లు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన కెసిఆర్ గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారికి బిజెపి నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల సమస్యలు సామరస్యంగా పరిష్కరిస్తామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం లాగా జైల్లో పెట్టమని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రతి పక్షాల మాయలోపడి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్, బిజెపి నాయకులకు లేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News