Thursday, May 8, 2025

సుందరాంగుల సందడి

- Advertisement -
- Advertisement -

మిస్‌వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు
10 ప్రాంతాల్లో డ్రోన్లపై నిషేధం అతిథులకు
సాంప్రదాయరీతిలో స్వాగతం ఏర్పాట్లను
పరిశీలించిన మంత్రి జూపల్లి

అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్ల పరిశీలన
మన తెలంగాణ/హైదరాబాద్: మిస్ వరల్డ్ పో టీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ సాం ప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏ ర్పాట్లు చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించి, స్వాగత సత్కారాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మిస్ వరల్డ్ వేడుకలకు వచ్చే సుందరీమణులు, ప్రతినిధులు, ఇతర అతిథులకు స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపల్లి స్వయంగా పర్యవేక్షించారు.
జీఎంఆర్ ప్యాసెంజర్ ఎక్స్పీరియన్స్, పర్యాటక శాఖ, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్‌ఎఫ్ అధికారులతో సమీక్షించారు. విమానాశ్రయాన్ని మరింత అందంగా ముస్తాబు చేయాలని, పూలు, మామిడి, అరటి తోరణాలతో సుందరంగా అలంకరించాలని సూచించారు. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్లియరెన్స్‌ను త్వరగా పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో మార్లే లీల్ సర్వాంతేస్ తో భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News