Wednesday, May 7, 2025

ఉద్యోగులు, ప్రజల మధ్య సిఎం చిచ్చు

- Advertisement -
- Advertisement -

మేనిఫెస్టోలో చెప్పిందే అడుగుతున్నారు అడ్డగోలు
హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకునే యత్నం రేవంత్
వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం తెలంగాణ దివాలా
తీస్తే మీ కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయి? కెసిఆర్‌ను
దూషిస్తే నాలుక చీరేస్తాం : బిఆర్‌ఎస్ అగ్రనేత కెటిఆర్

రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచిత వ్యాఖ్యలతో ఉద్యోగులు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని, కానీ సిఎం ఉద్యోగులను ప్రజల ముందు ఉద్యోగులను విలన్‌లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తారనే నమ్మకం లేక అడ్డగోలుగా హామీలు ఇచ్చారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల త్యాగాల గురించి ముఖ్యమంత్రికి ఇసుమంత కూడా తెలియదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ ఎన్‌జిఒల త్యాగాల స్పూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. ఉద్యోగాలు పోయినా.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై సిఎం రేవంత్ రెడ్డి మాటలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపంగా మారాయని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీని, తమను ఎన్ని తిట్టినా భరించామని, కానీ తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా సిఎం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అత్యంత అసమర్థ, దక్షతలేని సిఎం అని ఆయన సోమవారం చేసిన వ్యాఖ్యలతో తేలిపోయిందని విమర్శించారు. ఆదాయం పెరిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టామని తెలిపారు. కానీ పరిపాలన చేతకాదని.. సిఎం రేవంత్‌రెడ్డి కాడి కిందపడేశారని విమర్శించారు. నాయకత్వ లోపం.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పెట్టిన శాపం అని పేర్కొన్నారు.
దొంగ కాబట్టే దొంగ అని అంటున్నారు
రేవంత్‌రెడ్డి దొంగ కాబట్టే దొంగ అని అంటున్నారని కెటిఆర్ అన్నారు. నోట్ల కట్లతో దొరికిన రేవంత్ రెడ్డిని దొంగ కాక మరేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే.. అప్పు పుట్టడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ.. దొంగ చేతికి తాళాలు ఇచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డిని సిఎం చేసి..ఎఐసిసి, రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారని పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి కుటుంబం ఆస్తులు ఎలా పెరిగాయి..?
ఏడాదిలోనే సిఎం రేవంత్‌రెడ్డి కుటుంబం ఆస్తులు ఎలా పెరిగాయని కెటిఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఫోర్త్ సిటీలో 2 వేల ఎకరాలు ఎలా కొన్నారని, రాష్ట్రం దివాలా తీస్తే అనుముల కుటుంబ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయని నిలదీశారు. రేవంత్ రెడ్డి తమ్ముడు రూ.వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయో అనే కంపెనీ పెట్టారని, ఆయన అల్లుడు లగచర్లలో ఫార్మా కంపెనీ పెట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఒకవైపు దివాలా కోరు మాటలు.. మరోవైపు తెలంగాణ రైజింగ్ అంటున్నారని, ఇందులో ఏది వాస్తవం అని అడిగారు.
కెసిఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే నాలుక చీరేస్తాం
తమ అధినేత కెసిఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే ఇప్పటివరకు సహించామని, ఇకపై కెసిఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే రేవంత్ రెడ్డి నాలుక చీరేసే పరిస్థితి వస్తుందని కెటిఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి సోదరుల అరాచకాల వలనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. అడ్డమైన మాటలు బంద్ చేసి.. రేవంత్ రెడ్డి బుర్ర పెంచుకోవాలని సూచించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News