Thursday, May 8, 2025

ఆపరేషన్ సిందూర్.. రేపు అఖిలపక్షం కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది.

కాగా ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పిఓకె)లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్ తో విరుచుకుపడింది. మంగళవారం అర్థరాత్రి 25 నిమిషాలపాటు భారత ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్ లో భారీగా ఉగ్రవాదులు మరిణించినట్లు తెలుస్తోంది.జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది భారత దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ దాడులపై స్పందించిన పాక్.. భారత్ పై సరైన సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News