Thursday, May 8, 2025

రాబోయే వారం పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో మే 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావర కేంద్రం పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితులు మే 10వ తేదీ తరువాత కొనసాగవచ్చని, రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు

కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో మే 9వ తేదీ వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, మే 15వ తేదీ తరువాత తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News