నగరంలో అనధికారికంగా నివసిస్తున్న పాక్, బంగ్లాదేశీయులను
వెంటనే అదుపులోకి తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా
త్రివిధ దళాలకు అండగా ఉండాలి ఉద్యోగులు, మంత్రులందరూ
అందుబాటులో ఉండాలి విదేశీ పర్యటనలు వద్దు
అధికారులతో సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సైన్యానికి సంఘీభావంగా నేడు నగరంలో భారీ ర్యాలీ
మనతెలంగాణ/హైదరాబాద్:పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి నగరంలో అనధికారికంగా నివసిస్తున్న వారి ని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పహల్గా మ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సై న్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో రాజకీయాలకు తావు లేదని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎ లాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయా విభాగాలకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చా రు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉ దయం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఈ సమావేశంలో సిఎం నిర్ణయం తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సిఎం రేవంత్ సూచించారు. ఇలాంటి సమయంలో అందరం త్రివిధ దళాలకు అం డగా ఉండాలన్నారు.
ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తున్నానని ఆయన చెప్పారు. భారత రక్షణ రంగం లో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతమని, అన్ని విభాగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసిందని ఆయన వివరించారు.ఉద్యోగులు, మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సిఎం ఆదేశించారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయనహెచ్చరించారు. అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం ఉంచుకోవాలన్నారు. రెడ్ క్రాస్‌తో సమన్వయం చేసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలన్నారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని, ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
భద్రత పెంచండి
అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలని శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహారించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలన్నారు. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలని ఆయన సూచించారు. నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద దృష్టి సారించాలని ఆయన సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని హిస్టరీ షీటర్‌లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
సైన్యానికి సంఘీభావంగా నేడు ర్యాలీ
దేశ సైన్యంతో మనమంతా ఉన్నామన్న సందేశం ఇచ్చేలా భారత సైన్యానికి సంఘీభావంగా నేడు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. ఈ ర్యాలీలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటనగా ఈ ర్యాలీ కొనసాగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రతి పౌరుడు ఆర్మీకి అండగా ఉండాలి
ఈ సమీక్షకు హాజరయ్యే ముందు సిఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ బయట విలేకరులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ పట్ల ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు ఆర్మీకి అండగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పార్టీలను పక్కకు పెట్టి ఒక్కటిగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత రక్షణ రంగంలో హైదరాబాద్ పాత్ర అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో శత్రు దేశం దాడి చేస్తుందన్న సంకేతాల మేరకు రాష్ట్రంలో అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.