మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. మాక్ డ్రిల్ ప్రారంభంలో నగరంలోని ముఖ్య కూడళ్లలో, అపార్ట్‌మెంట్ల వద్ద సైరన్లు మోగించారు. ప్రజల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందిం చాలో అవగాహన కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టారు అధికారులు. ప్రజలతో పాటు సహాయక సిబ్బంది కూడా ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నానల్‌నగర్, కంచన్‌బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్‌ఎఫ్‌సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, రక్షణశాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతా ధికారులు డ్రిల్‌ను పర్యవేక్షించారు. ఇక సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగితే ఎలాఉంటుందో ఊహించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 12 మంది సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చా రు. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలు, అధికార సిబ్బం ది అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో, ఎవరి బాధ్యతలు ఏమిటన్న అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగింది. మొత్తం 24 శాఖల అధికారుల కోఆర్డినేషన్ తో ఈ డ్రిల్ చేపట్టగా ఫైరింగ్ జరిగినట్టు శబ్దాలు వినబడటం, టెర్రరిస్టులు కాల్పులు జరపడం, ఒక బిల్డింగ్‌లోకి వెళ్ళి కాల్పులు జరిపితే అక్కడ ఉన్నవా రిని సురక్షితంగా బయటికి తీసుకురావడం వంటి సంఘటనలను ప్రదర్శించారు. శంషాబాద్ లోని బస్టాండ్ వద్ద పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
ప్రజల అప్రమత్తత కోసమే : సిపి సివి ఆనంద్
హైదరాబాద్‌లో మాక్‌డ్రిల్ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పారిశ్రామిక సైరన్‌లు, పెట్రోల్ బంకుల వాహనాల సైర న్లు, పోలీస్ వాహ నాల సైరన్లను ఏకకాలంలో మోగించాం. సైరన్ మోగిన వెంటనే ప్రజలు ఎక్కడివారు అక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సూచనలు జారీ చేశాం. నగరంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లుగా భావిం చి, మాక్‌డ్రిల్‌ను నిర్వహించాం‘ అని వివరించారు.
54 ఏండ్ల తర్వాత మాక్ డ్రిల్
దాదాపు 54 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. 1962లో తొలిసారి ఇండో-చైనా యుద్ధ సమయంలో మాక్ డ్రిల్ నిర్వ హించారు.