Thursday, May 8, 2025

పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు.. ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్‌లో షాపులను హైడ్రా అధికారులు కూల్చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. దీంతో పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. హైడ్రా జెసిబి ఎక్కి, జెసిబి ముందు పడుకొని కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు చేపట్టారు. నిరసనలను తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News