కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలమ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సింగిల్ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొత్త కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంటర్వెల్, క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి. యంగ్‌స్టర్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు. మేము అనుకున్నది స్క్రీన్ మీదకి చాలా అద్భుతంగా వచ్చింది.
ఆడియన్స్ సినిమా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. -గీతా ఆర్ట్‌లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. – డైరెక్టర్ కార్తీక్ రాజు -కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్‌టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్ గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్‌టైనర్ అవుతుందని అనిపించింది. -చాలా కొత్త క్లైమాక్స్ ఇది. అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్, ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్‌కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్‌గా ఉంటుంది. అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది. -సినిమాని పూర్తిగా హైదరాబాద్ లో తీశాం. హైదరాబాద్‌ని చాలా కొత్తగా చూపించాం. ఇది ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఉన్న ఫ్రెష్‌నెస్ నా బాడీ లాంగ్వేజ్‌లో కూడా ఉంటుంది. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌లో నన్ను ఆడియన్స్ చూస్తారు. సినిమా ఒక హైపర్ ఎనర్జీతో వచ్చింది. దానికి తగ్గట్టు విశాల్ చంద్రశేఖర్ ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్‌ఆర్ చాలా బాగా చేశారు. -ఇక ప్రస్తుతం మృత్యుంజయ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నా. అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చేస్తున్నాను”అని అన్నారు.
Single movie