- Advertisement -
వరంగల్: ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో పలువురు పోలీసులకు గాయపడినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లా సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు దుర్మరణం చెందిన విషయం విధితమే.
Mulugu District Vajedu
- Advertisement -