Thursday, May 8, 2025

ఆ స్కామ్ లో విజయవాడ పాలేరు కూడా ఉన్నారు: కేశినేని శివనాథ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. మాజీ ఎంపి  కేశినేని నాని చేసిన ఆరోపణపై టిడిపి ఎంపి కేశినేని శివనాథ్ రీకౌంటర్ ఇచ్చారు. వాటి గురించి కూడా నిగ్గు తేలిస్తే బాగుంటుందని, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డితో రాజ్‌ కేసిరెడ్డికి సాన్నిహత్యం ఉందని, అందుకే రాజ్‌ కేసిరెడ్డిని దూరంగా పెట్టారని స్పష్టం చేశారు. ఎపిలో రూ.3200కోట్ల విలువైన లిక్కర్‌స్కామ్‌ జరిగిందని శివనాథ్ ఆరోపణలు చేశారు.

తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నవ్యక్తే ప్రధాన సూత్రధారి అని, ఆ ప్యాలెస్‌లో రాజ్‌తో సహా నలుగురికే ఎంట్రీ ఉంటుందని ఎద్దేవా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని చిన్ని సవాల్ విసిరారు. 24 గంటల సమయం ఇస్తున్నానని తనపై వచ్చిన ఆరోపణలు నిరూపణ చేయాలని జగన్ మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో సిబిఐ విచారణకు జగన్ సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. ఈ స్కామ్ లో కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డితో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నాడని శివనాథ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News