పాకిస్థాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని, దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని.. మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.పిఒకెలో ఉగ్రవాదులను వేటాడుతున్నామని.. రెచ్చగొడితే..చూస్తూ ఊరుకోమని.. దాడులు చేసేందుకు భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తాము ఎల్లప్పుడూ చాలా సంయమనంతో బాధ్యతాయుతంగా వ్యవహరించామని… చర్చల ద్వారా సమస్యల పరిష్కరాన్ని తాము నమ్ముతామని, కానీ.. తమ సహనాన్ని పరీక్షించవద్దని.. అలా చేయడానికి ప్రయత్నిస్తే, వారు ఆపరేషన్ సిందూర్ లాంటి బలమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా ఇస్లామాబాద్.. భారతదేశంలోని 15 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. దీంతో గురువారం భారత ఆర్మీ.. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలలో వైమానిక రక్షణ రాడార్‌లను లక్ష్యంగా చేసుకుని లాహోర్‌లో డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది.