Friday, May 9, 2025

భారత సైన్యానికి సంఘీభావంగా సిఎం రేవంత్ భారీ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లస్‌ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు యువత భారీగా తరలివచ్చింది.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. జవాన్లకు స్ఫూర్తి ఇవ్వడానికే ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. వీర జవాన్లకు అండగా నిలబడేందుకు వచ్చిన యువత, ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి అండగా ఉంటామని ఖర్గే, రాహుల్ చెప్పారన్నారు. “ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మా హెచ్చరిక.. మా దేశం వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లే. పాకిస్తాన్‌కు స్వాతంత్రం ఇప్పించింది కూడా మహాత్మా గాంధీనే. మా శాంతి ఆకాంక్షను చేతగాని తనంగా భావించొద్దు. మా భూభాగంలోకి అడుగుపెడితే ఆపరేషన్‌ సిందూరే మీకు సమాధానం. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు వీర సైనికులకు అండగా ఉంటారు” అని సిఎం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News