Wednesday, May 21, 2025

ఎపి సిఎం చంద్రబాబుకు పటిష్ట భద్రత..

- Advertisement -
- Advertisement -

‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఎపిలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, విఐపిల భద్రతపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై డిజిపి హరీశ్‌కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రతో పాటు ఉన్నతాధికారులు చర్చించారు. ఇందులో భాగంగా సిఎం చంద్రబాబు భద్రత విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులను డిజిపి ఆదేశించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఎక్కడా రాజీపడవద్దని అధికారులకు సూచించారు. జన సమూహంలోకి సిఎం వెళ్తున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా చర్యలు విషయాన్ని ఉన్నతాధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. సామా న్య ప్రజలు, కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మేర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News