హైదరాబాద్‌కు మూసీ నది ఓ వరం బిజెపి చేస్తే గొప్ప..
మేం చేస్తే తప్పా? పెద్దల పట్ల కఠినంగా.. పేదల పట్ల
జాలిగా వ్యవహరించాలి 400 ఎకరాలను మేం కాపాడాం
హైడ్రా పోలీసుస్టేషన్ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/సిటీబ్యూరో: సబర్మతి, యమునా నదులను పునరుద్ద్ధరిస్తే తప్పులే దు. మూసీ నదిని పునరుద్ద్ధరించుకుంటే త ప్పా? మోడీ, యోగి చేస్తే గొప్ప.. తెలంగాణ ప్రజలు చేసుకుంటే తప్పా..అని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి భగ్గుమన్నారు. మూసీ నది ఉండటం మన హైదరాబాద్ నగరానికి వరమని రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ నది, చెరువుల, నాలాల ఆక్రమణలను తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందంటున్నారు. 400 ఎకరాలను మేం కాపాడాం. ఆ భూమిలో ఒక పెద్ద ఐటీ కంపెనీ పెడుదామంటే ప్రకృతిని దెబ్బతీస్తున్నారంటున్నా రు. రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుందో చె ప్పండి. ఉద్యోగాలను ఎలా పెంచుకోవాలో తెలపండంటూ విమర్శకులను ఆయన సూ టిగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పోలీసుస్టేషన్‌ను సిఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడు తూ మూసీ నదిలో ఆక్రమణలు, చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వాళ్లకే హైడ్రా అంటే భయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చే సింది. ఆక్రమణలను అడ్డుకోవడానికే హై డ్రా అని ముఖ్యమంత్రి తెలిపారు. హైడ్రా అ ధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. బెంగళూరు నగరం ప్ర కృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది. వాన నీటిని ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరులో వలసపోయే పరిస్థితి వచ్చిందని సిఎం
అభిప్రాయపడ్డారు. ముంబయి, ఢిల్లీ నగరాల్లో ప్రకృతిని పరిరక్షించుకోకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఇది ప్రకృతి తప్పిదం కాదు మానవ తప్పిదమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉపద్రవంను చూసి పాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్‌కు ఆ పరిస్థితి వస్తుందనేది హెచ్చరించారు. హైడ్రా అంటే పేదల ఇళ్లను కూల్చుతుందని కొంతమంది చిత్రీకరిస్తున్నారని, హైడ్రా అంటే కూ ల్చడమే కాదు, ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా అని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైడ్రా విషయంలో కొంతమంది కడుపుమంటతో దూషిస్తున్నారని, అవన్నీ నే ను పట్టించుకోను. పేదల పట్ల కఠినంగా ఉండకండి. .పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి.. అంటూ సిఎం సూచించారు. హైడ్రా తొమ్మిదిన్నర నెలల్లో ప్రజలకు మరింత చేరువైందని, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలకు సంబంధించిన అధికారాలు.. హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా కల్పించినట్టు తెలిపారు.
లేక్ వ్యూ పేరుతో..
కొందరు రాజకీయ అధికారాన్ని అడ్డంపెట్టుకొని పేదలకు అడ్డంగా గోడలు కట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు కబ్జాలకు గురయ్యాయి. లేక్ వ్యూ పేరుతో నడిచెరువులో ఇళ్లు కడుతున్నారు. ఫాం హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు నిర్మించుకుంటున్నారనీ, వాటి నుంచి వ్యర్థాలు, మురుగునీరు చెరువుల్లో కి వదులుతున్నారని పేర్కొన్నారు. నాలాలను ఆక్రమించి ఇళ్లుకడితే వరదనీళ్లు ఎక్కడికి వెళ్తాయి..? పాతికేళ్లుగా సాధించని బతుకమ్మకుంటను సాధించాం. చెరువులను మేం కాపాడటం తప్పా. నగరంలో పని మీద వచ్చిన వా ళ్లు వరదల్లో, ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి సమ యం వృథా అవుతుందంటూ ముఖ్యమంత్రి తెలిపారు. అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శాఖల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తుంటే ఆశించిన ఫలితాలు రాలేదు. వర్షాలకు ఇళ్లల్లోకి నీళ్లొచ్చి ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోతున్నారు. అప్పుడు 10 వేలు ఇస్తామన్నారు, 10 లక్షల ఆస్తి పోతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని సిఎం చెప్పుకొచ్చారు.
చెరువులను కాపాడుకోవాలి..
మన పూర్వీకులు మనకు ఇచ్చిన చెరువులను కాపాడుకోవాలని, చెరువులు కనుమరుగైతే మనకు మనుగడ కష్టమేనని, 450 ఏండ్ల చరిత్ర ఉన్న నగరాని కాపాడుకొనేందుకు హైడ్రా పనిచేస్తుందని, నగరాభివృద్ద్ధి కోసం గత సీఎంలు ఎన్నో చట్టాలు చేశారని, 1908లో హైదరాబాద్‌లో వచ్చిన వరదలు నాటి నిజాంను బాగా కలిచివేసిందని, అలాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరానికి మళ్ళీ రావద్దని, గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి హైదరాబాద్‌లో మూసీ నదిపై డ్రైనేజీ వ్యవస్థను నిర్మించినట్టు సిఎం పేర్కొన్నారు. వరదలను నివారించడానికి నిజాం… మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో మూసీనదిపై జంట జలాశయాలను నిర్మించారని చెప్పారు. హైదరాబాద్‌లో గొప్పగొప్ప నిర్మాణాలు నిజాం పాలనకు నిదర్శనమని, ఓల్డ్ సిటీతో మనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ను కాపాడి తీరుతాం. మూసీ నదిని కబ్జా చేసిన పెద్దలను తొలగించి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఇస్తున్నాం. హైడ్రా పెద్దల పట్ల కఠినంగా, పేదల పట్ల జాలీగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
సామాజిక బాధ్యతతో..
సీఎం ఏ ఉద్దేశ్యంతో హైడ్రాను ప్రారంభించారో.. అదే ఉద్దేశంతో హైడ్రా పని చేస్తుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరించారు. సామాజిక బాధ్యతతో హైడ్రా ముందుకు వెళ్తుందని చెప్పారు. అస్సెట్ ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా.. డిజాస్టర్ రెస్పాన్స్ కూడా సరైన అధికారులతో హైడ్రా పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం కూడా పెద్ద ఎత్తులో వాడుతూ ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తిస్తున్నామన్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు ద్వారా ల్యాండ్ గ్రేబింగ్, చీటింగ్, ఫోర్జరీ చేసే వారిపై చర్యలు తీసుకోనే అవకాశం దక్కిందని రంగనాథ్ తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో 20 డిఆర్‌ఎఫ్ ట్రక్స్, 55 స్కార్పియోలు, 4 ఇన్నోవాలు, 5 మినీ బస్సులు ట్రక్స్, 37 ద్విచక్ర వాహనాలను సిఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తీ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతోపాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.