Saturday, May 10, 2025

పాక్ దాడులు.. గుజరాత్‌ తీరంలో భారీగా ఆర్మీ షిపుల మోహరింపు

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేస్తుండటంతో అప్రమత్తమైన భారత ఆర్మీ ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతోంది. జమ్ము, అమృత్ సర్ వంటి సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది పాక్. దీంతో భారత ఆర్మీ ఎదురుదాడికి దిగింది. లాహోర్, కరాచీలో బాంబులతో విరుచుకుపడింది. గుజరాత్‌ సముద్రతీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. సముద్రంలో భారీగా ఆర్మీ షిప్‌లు మోహరించారు. ఇక, పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులను హర్యానా ప్రభుత్వం రద్దు చేసింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విమానాశ్రయాల్లోని సెకండరీ లాడర్‌ పాయింట్‌లో ప్రయాణికుల తనిఖీలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినళ్లలో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు. విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని తెలిపారు. అలాగే, దేశంలోని ప్రముఖ దేవాలయాలు వద్ద భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని ఆదేశించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News