Saturday, May 10, 2025

పాక్ కు గట్టి జవాబిస్తాం.. డ్రోన్ దాడులపై భారత ఆర్మీ ప్రకటన

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌ డ్రోన్ దాడులపై భారత్‌ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి పాక్‌ డ్రోన్లతో దాడి చేసిందని తెలిపింది. సరిహద్దు వెంబడి జమ్మూకశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిందని.. పాక్ సైన్యం కాాల్పుల్లో పలువురు పౌరులు మరణించారని చెప్పింది. పాక్‌ కాల్పులను తిప్పికొట్టామని.. దీటుగా జవాబిస్తామని పేర్కొంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని భారత ఆర్మీ వెల్లడించింది.

కాగా, నిన్న రాత్రి నుంచి పాక్.. భారత సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ.. వాటిని కుల్చివేశాయి. మూడు పాక్ ఫైటర్ జెట్ లను కూల్చివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ పాక్ పైలట్ ను భారత సైనికులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బార్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News