అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అంటూ శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లింది. అందుకే శ్రీలీల క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో పెరిగింది. కిస్సిక్ కారణంగానే బాలీవుడ్‌లో సినిమాను చేసే అవకాశంను దక్కించుకుంది. తమిళనాట కూడా ఈ భామ ఒక సినిమాను చేస్తోంది. హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీలీల త్వరలోనే తెలుగులో ఒక బిగ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చి బాబు ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ పాటను శ్రీలీలతో చేయిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నిర్మాతలు చర్చించారని సమాచారం. పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో ఆకట్టుకుంది. దీంతో ‘పెద్ది’లో శ్రీలీలను ఐటమ్ సాంగ్ కు ఎంపిక చేస్తే బాగుంటుదని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే ఈ పాట సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందట.