Saturday, May 10, 2025

మంచి కంటెంట్ ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘కర్మణ్యేవాదికారస్తే’. క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్‌లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశా లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్‌లో బీజీఎమ్ హైలెట్‌గా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని డిఎస్‌ఎస్ దుర్గా ప్రసాద్ ఉ షస్విని ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మి-స్తున్నారు. అమర్ దీప్ చల్లపల్లి డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పా రు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ..“ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది.

శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే మన ఇంట్లోనే ఉంటారు అని ఒక చక్కటి కాన్సెప్ట్ తో డైరెక్టర్ ఈ సినిమాని మన ముందుకు తీసుకువస్తున్నారు”అని అన్నారు. డైరెక్టర్ అమర్ దీ ప్ చల్లపల్లి మాట్లాడుతూ..“ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇంతమంచి కంటెంట్ ని ప్రేక్షకుల ముం దుకు తీసుకు వస్తున్న ప్రొడ్యూసర్‌కి నా ధన్యవాదాలు”అని తెలిపా రు. ప్రొడ్యూసర్ డిఎస్‌ఎస్ దుర్గా మాట్లాడుతూ..“డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని ఒక చిన్న సినిమా గా కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాగా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, మధుర శ్రీధర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News