Saturday, May 10, 2025

భారత్-పాక్ మధ్య వార్ టెన్షన్.. ఐపిఎల్‌ 2025 వాయిదా

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2025వ సీజన్ వాయిదా పడింది. భారత్‌-పాక్‌ సైనిక ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. నిన్న రాత్రి ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ జట్లు తలపడుతుండగా.. మధ్యలోనే మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది.  జమ్మూ, పఠాన్‌కోట్ సమీప ప్రాంతాలలో పాక్ దాడులకు ప్రయత్నిస్తుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ ను రద్దు చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం టోర్నమెంట్ అధికారులతో అత్యవసర సమావేశమైన బిసిసిఐ.. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానుల భద్రతే ముఖ్యమంటూ ఐపిఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా,  ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం గా భారత సాయధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించాయి. దీంతో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News