టీయూడబ్ల్యూజే వినతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి తెల్ల రేషన్ కార్డులను మంజూరుకు సత్వర చర్యలు చేపడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనస్థితిలో జీవితాలు కొనసాగిస్తున్న జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులను అందించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ శుక్రవారం మంత్రిని కలుసుకుని విజ్ఞప్తి చేశారు.
గతంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డుల జారీకి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు విరాహత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు.
White ration cards for eligible journalists