Saturday, May 10, 2025

నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు సిఎం విరాళం

- Advertisement -
- Advertisement -

జాతీయ రక్షణ నిధికి విరాళాలు (Revanth salary donate) అందచేయాలని
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి
మన సాయుధ దళాలకు అండగా నిలవాలని సూచన

మనతెలంగాణ/హైదరాబాద్: తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు(Army) మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరో స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు. భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని(salary) జాతీయ రక్షణ నిధి కి విరాళంగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. మనదేశ ధీర సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, మన సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అందిస్తున్న అసమాన సేవలకు చిన్న సహకారంగా, ఒక భారతీయుడిగా తాను ఒక నెల జీతాన్ని(Revanth salary donate) జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ పవిత్ర లక్ష్యంలో అందరూ భాగస్వాములు కావాలని, తన సహచరులు, పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్క భారతీయుడిని దీని కోసం ఆహ్వానిస్తున్నానని ఆయన తెలిపారు. మన సాయుధ దళాలకు అండగా నిలుద్దామని, విజయం మన సొంతమని, జై హింద్ అని ముఖ్యమంత్రి(Revanth Reddy) ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News