Saturday, May 10, 2025

ఏడుగురు చొరబాటుదారుల హతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో( Samba sector) గురువారం రాత్రి చొరబాటుకుయత్నించిన ఏడుగురు టెర్రరిస్ట్ (Terrorist) లను సరిహద్దు భద్రతా దళం హతమార్చింది. సరిహద్దు రేఖ వెంబడి ఒక పక్క పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతూనే, జమ్మూకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో ఏడుగురు టెర్రరిస్ట్‌లు (Terrorist) మనదేశంలో చొరబడేందుకు పాక్ సైన్యం సాయం చేసిందని బీఎస్ ఎఫ్ తెలిపింది. బీఎస్ ఎఫ్ దృష్టి చొరబాటు దారులవైపు పడకుండా, ఈ నాటకం ఆడింది. కాగా, ఆ ఏడుగురు టెర్రరిస్ట్ లను హతమార్చడమే కాకా, పాక్ పోస్ట్ ను కూడా భారతసైన్యం ధ్వంసం చేసింది.

మే 9-9 తేదీల మధ్యరాత్రి సాంబా సెక్టార్ లో( Samba sector) చొరబడుతున్న టెర్రరిస్ట్ లను నిఘా గ్రిడ్ గుర్తించినట్లు బిఎస్‌ఎఫ్ పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ దళాలు ఏడుగురు టెర్రరిస్ట్ లపై ఆయుధాలతో విరుచుకుపడి వారిని హతమార్చడంతో పాటు థన్ ధార్ లోని పాక్ సరిహద్దు పోస్ట్ ను ధ్వంసం చేసింది. సరిహద్దు పోస్ట్ ను ధ్వంసం చేసిన వీడియోను కూడా బీఎస్ ఎఫ్ షేర్ చేసింది. పాక్ సైన్యం టెర్రరిస్ట్ లు మనదేశంలో సరిహద్దుల్లోకి చొరబడడానికి ఎలా సాయం చేసిందో ఈ వీడియోలో తెటతెల్లమైంది. టెర్రరిస్ట్ లకు పాక్ కేంద్రంగా మారిందన్న వాస్తవాన్ని కూడా ఈవీడియో ప్రపంచానికి వెల్లడించింది. పాక్ టెర్రరిస్ట్ లకు అడ్డాగా మారిందని చాలాకాలంగా భారతదేశం పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News