- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దులో కగార్ ఆపరేషన్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో కర్రెగుట్ట నుంచి బలగాలను దశలవారీగా కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. కర్రెగుట్టను జల్లెడ పడుతున్న బలగాలను సిఆర్‌పిఎఫ్ బలగాలు హెడ్ క్వార్టర్స్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా బలగాలు పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి వెనక్కిమళ్లుతున్నాయి. ఆదివారం ఉదయం లోపు 5000 సిఆర్‌పిఎఫ్ బలగాలు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి. ఛత్తీసగఢ్ వైపు డిఆర్ జి, ఎస్ టిఎఫ్, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో యదావిధిగా కగార్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో ఏజెన్సీ గ్రామాలలో ప్రశాంతత చోటుచేసుకోనుంది.
- Advertisement -