న్యూయార్క్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఫోన్ చేశారు. భారత్-పాకిస్థాన్ కు మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని తెలిపారు. ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని మార్కో రూబియో వెల్లడించారు.
ఎల్ఒసి దగ్గర పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. జనావాసాలే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. జనావాసాలు, హిందూ దేవాలయాలపైనా పాక్ దాడులు చేస్తోంది. కాశ్మీర్‌లోని శంభులో ఆలయంపై పాక్ రేంజర్లు దాడులకు పాల్పడుతున్నారు. పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతుంది. భారత్ ప్రతిదాడులకు పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది. దీంతో పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధికారులు పాల్గొననున్నారు. భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై షెహబాజ్ చర్చించనున్నారు.