శ్రీనగర్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్‌లో ఎన్‌ఐటి విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోత మోగుతుండడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. శ్రీనగర్ ఎన్‌ఐటిలో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. పది మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు భద్రతా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ తమని కాపాడాలని తెలంగాణ పౌరులు ఎమర్జెన్సీ కాల్స్ చేశారు. సరిహద్దుల్లో చిక్కుకున్నామని సహాయం చేయాలని 30 ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. 8 మందిని సురక్షితంగా కాపాడినట్టు కంట్రోల్ రూమ్ అధికారులు వెల్లడించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఎపి, తెలంగాణ విద్యార్థులు లేఖ రాశారు. కశ్మీర్ నుంచి సురక్షిత ప్రాంతాలని తరలించాలని కోరడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే స్పందించారు. యూనివర్సిటీ అధికారులు, కలెక్టర్‌తో బండి సంజయ్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.