Sunday, May 11, 2025

పాక్‌ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ సైన్యం ఓ వైపు డ్రోన్స్, మిస్సైల్స్ తో భారత్ పై దాడులు చేస్తూనే..మరోవైపు సరిహద్దు నియంత్ర రేఖ(ఎల్ఓసి) వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది. నిన్న రాత్రి పాక్ జరిపిన దాడుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో మరణించిన వారి పట్ల జమ్ముకాశ్మీర్ సిఎం ఒమర్‌ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాక్ దాడిలో చనిపోయిన అధికారి కుటుంబ సభ్యులను సిఎం కలిసి పరామర్శించారు. అనంతరం చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News