- Advertisement -
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న క్రమంలో బిసిసిఐ ఐపిఎల్ 2025 సీజన్ ను మధ్యలోనే వాయిదా వేసింది. మిగిలిన మ్యాచ్ లను వారం రోజులపాటు వాయిదా వేస్తూ బిసిసిఐ ప్రకటించిన సంగతి తెలసిందే. అయితే, ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపిఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభం కావడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఈ క్రమంలో వారం రోజుల తర్వాత ఐపిఎల్ మిగిలిన మ్యాచ్ లను నిర్వహించేందుకు బిసిసిఐ చర్యలు చేపట్టినట్లు సమాచారం. మిగిలిన మ్యాచ్ ల కోసం కొన్ని నగరాలను షార్ట్ లిస్ట్ చేసినట్లు ఓ వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ తిరిగి ఐపిఎల్ మ్యాచ్ లు ప్రారంభమైతే.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనే మ్యాచ్ లను నిర్వహించేందుకు బిసిసిఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
- Advertisement -