Sunday, May 11, 2025

ఆపరేషన్ సిందూర్.. కీలక ఉగ్రవాదులను లేపేసిన భారత్ సైన్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు సంబంధించిన కీలక ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని లష్కరే తోయిబా, జైషేతోపాటు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. భారత దాడుల్లో 100మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే, చనిపోయిన వారిలో లష్కరే తోయిబా, జైషే ఉగ్రసంస్థల్లో కీలకంగా ఉన్న ముదస్సర్ ఖాదియన్ ఖాస్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసుఫ్ అజార్, ఖలీద్ (అబు ఆకాషా), మొహమ్మద్ హసన్ ఖాన్ అనే ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని వర్గాలు తెలిపాయి. ఇందులో మొహమ్మద్ యూసుఫ్ అజార్.. జైషే చీఫ్ మసూద్ అజార్ బావమరిది అని నివేదికలు వెల్లడించాయి. కాగా, ఈ దాడుల్లో మసూద్ ఇప్పటికే తన సోదరుడిత్ సహా 10 కుటుంబ సభ్యులు, నలుగురు సన్నిహితులను కోల్పోయాడు. ఈ విషయాన్ని అంగీకరిస్తూ లేఖ కూడా విడుదల చేశాడు. ఎయిర్ ఇండియా హైజాక్ సూత్రదారి

తొలగించబడిన ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలలోని అత్యంత ఉన్నత స్థాయి వ్యక్తులలో కొందరు, లష్కరే తోయిబా మరియు జైషే మొహమ్మద్ రెండింటితో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News