Sunday, May 11, 2025

రాష్ట్ర ప్రతిష్టను ఎమ్మెల్సీ కవిత దెబ్బ తీయాలని చూస్తున్నారు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రతిష్టను ఎమ్మెల్సీ కవిత దెబ్బ తీయాలని చూస్తున్నారని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్‌లపై ఆయన స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక ఫెలిసేటేటర్ మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రం చాలా సేఫెస్ట్ ప్లేస్ అని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చని, తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్ చేయాలన్న ఉద్ధేశ్యంతోనే నాలుగు నెలల క్రితం తెలంగాణను ఈ ఈవెంట్ కోసం ఎంపిక చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ మీద నమ్మకంతో ఇక్కడ ఈవెంట్ పెట్టుకున్నారన్నారు. ఈ రోజు మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఆ కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ ఈవెంట్‌ను పోస్ట్ ఫోన్ చేయాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం వారికి సహకరిస్తుందని, వాళ్లు పోటీలు నిర్వహించాలని అనుకున్నప్పుడు మనం వాటిని పోస్ట్ పోన్ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. 105 దేశాల నుంచి మిస్ వరల్డ్, మిస్ కంట్రీస్ వచ్చి ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే వాళ్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఒక మూడు నుంచి నాలుగు వందల మంది డెలిగేట్స్ తెలంగాణలో ఉన్నారని ఆయన చెప్పారు. వీళ్లతో పాటు ఈవెంట్ నడిపించే స్పాన్సర్షిప్ చాలా మంది ఇక్కడే ఉన్నారని, వాళ్లు తీసుకోవాల్సిన నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయం చేయాలన్న దురుద్దేశం నుంచి దూరంగా ఉండి వాస్తవాలు మాట్లాడాలని ఎంపి చామల ఎమ్మెల్సీ కవితకు ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News