Sunday, May 11, 2025

పాక్ దాడులలో రెండేళ్ల పాపతో సహా ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ సేనలు అనిర్థిష్టంగా విచక్షణారహితంగా శనివారం జరిపిన దాడులలో ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి సహా ఐదుగురు దుర్మరణం చెందారు. జమ్మూ ప్రాంతంపై పాక్ సేనలు తెల్లవారుజాము నుంచే మోర్టార్లు, డ్రోన్లతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. పాక్ దాడిలో రెండు సంవత్సరాల బాలిక కూడా బలి అయింది. ఇంకా తెల్లవారకముందే శత్రు సేనల నుంచి ఆరంభమైన దాడులతో జమ్మూ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు మోర్టారు దాడుల దశలో రాజౌరి ప్రభుత్వ ఉద్యోగి, అదనపు జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్ (డిడిసి)హోదాలో ఉన్న రాజ్‌కుమార్ థాపా మృతి చెందారు. దీనితో రాజౌరీలో భారీ స్థాయిలో విషాదం నెలకొంది.

పెద్ద ఎత్తున బాంబుల మోతలు ,విస్ఫోటనాలతో జమ్మూ ప్రాంతం దద్దరిల్లింది ఇక రాత్రి అంతా సరిహద్దులకు ఆవల నుంచి పాక్ సేనలు సాగించిన కాల్పులతో సరిహద్దు పల్లెలు పట్టణ ప్రజలు కునుకులేకుండా గడపాల్సి వచ్చింది.పాకిస్థాన్ పెద్ద ఎత్తున డ్రోన్లను వినియోగించింది. మోర్టార్లతో విరుచుకుపడింది. పాకిస్థాన్ దాడులను భారత సేనలు తగు రీతిలో తిప్పికొట్టాయి. భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లేలా పాక్ దురుసుగా వ్యవహరించింది. ఇందుకు తగు విధంగా భారత్ స్పందిస్తుందని, దెబ్బకు దెబ్బ తీస్తుందని రక్షణ శాఖ వర్గాలు శనివారం మధ్యాహ్నం తెలిపాయి. రాజౌరీ పట్టణంలో పాక్ సాగించిన దాడులలో తన అధికారిక నివాసంలో దెబ్బతిని తీవ్రగాయాలకు లోనయిన ఉన్నతాధికారి రాజ్‌కుమార్ థాపాను వెంటనే చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.

అయితే ఫలితం లేకుండా పోయింది. ఆయన దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావం ఉన్న సీనియర్ అధికారిని రాష్ట్రం కోల్పోయిందని ముఖ్యమంత్రి స్పందించారు. ఒక్కరోజు క్రితమే ఆయన రాజౌరీలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలకు స్థయిర్యం కల్పించారు. ల్లవారుజామున కునుకు తీస్తూ ఉండగా పాకిస్థాన్ దొంగ దెబ్బకు విషాదాంతం చెందారని ఒమర్ స్పందించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఇక రాజౌరీ పట్టణ శివార్లలో పాక్ దాడులతో రెండేళ్ల పాప ఐషా నూర్ చనిపోయింది. ఈ కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News